Home సినిమాలు పెళ్లి తర్వాత మా ఇద్దరి మధ్య మాటలు తగ్గాయి: నాగబాబు

పెళ్లి తర్వాత మా ఇద్దరి మధ్య మాటలు తగ్గాయి: నాగబాబు

ఆడపిల్ల పెళ్లి అంటే ప్రతి ఇంట్లో అదో మహా వైభోగం. తల్లిదండ్రులు తమ బాధ్యతగా కన్న కూతురిని అల్లుడి చేతిలో పెట్టే శుభ గడియ ఓ మెమరబుల్ మూమెంట్. కాకపోతే ఇన్నాళ్లు అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కూతురు పుట్టినింటి నుంచి మెట్టినింట అడుగుపెడుతుంటే ఆ తల్లిదండ్రులు పెట్టుకునే ఆనంద భాష్పాలను వర్ణించడానికి మాటలు చాలవు.ప్రస్తుతం అదే మూడ్‌లో ఉన్నారు మెగాబ్రదర్ నాగబాబు.ఆయన కుమార్తె నిహారిక వివాహం డిసెంబర్ 9వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యను అత్యంత సన్నిహితుల సమక్షంలో రాజస్థాన్ లోని ఉద‌య్‌పూర్ ప్యాలెస్‌లో పెళ్లాడింది నిహారిక. 

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు నిహారిక పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.”నా కూతురు నిహారిక అంటే నాకెంతో ఇష్టం. తను నాకో బెస్ట్‌ ఫ్రెండ్. నాకు సంబంధించిన ఎన్నో విషయాలను ఆమెతోనే పంచుకుంటాను. మాఇద్దరి మధ్య మాటల్లో చెప్పలేనంత అనుబంధం ఉంది. కాకపోతే, పెళ్లి అయ్యాక మా ఇద్దరి మధ్య మాటలు కొంచెం తగ్గాయి. అయినప్పటికీ తను జీవితంలో కొత్త అంకానికి నాంది పలికినందుకు నాకెంతో సంతోషంగా ఉంది అని నాగబాబు పేర్కొన్నారు.అంతేకాకుండా నిహారికకు డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేయడానికి గల కారణాన్ని కూడా ఆయన వెల్లడించారు.నిహారికకు డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేయడానికి చాలా కారణాలున్నాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వేడుకలు తక్కువమందితో మాత్రమే జరగాలనే నిబంధనలు ఉన్నాయి. అందుకే, కేవలం మా కుటుంబసభ్యులు, కొంతమంది స్నేహితులతో ఈ విధంగా ప్లాన్‌ చేశాం. అని నాగబాబు చెప్పుకొచ్చారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు