Home సినిమాలు పూరీ జగన్నాథ్ కొత్త మూవీపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్‌..!

పూరీ జగన్నాథ్ కొత్త మూవీపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్‌..!

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్ ప్ర‌స్తుతం విజ‌య్‌దేవ‌ర కొండ‌తో ‘లైగ‌ర్’ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం శరవేగంగా చిత్రీకరణ జ‌రుపుకుంటోంది. అయితే, ఈ సినిమా విడుద‌ల కాక‌ముందే పూరీ జగన్నాథ్ మ‌రో క్రేజీ ప్రాజెక్టును లైన్‌లో పెట్టిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ సారి పూరీ శాండ‌ల్ వుడ్ హీరోతో సినిమా చేయ‌బోతున్నాడ‌న్న వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

పూరీ, దర్శకత్వంలో కన్నడ యువ కథానాయకుడు ధ్రువ సర్జా హీరోగా ఈ సినిమా రూపొందనుందట. ‘పొగరు’లో ‘ఖరాబు మాసు ఖరాబు..’ అంటూ తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు ధ్రువ. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ ‘లైగర్‌’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ధ్రువ సర్జా కన్నడంలో ‘దుబారీ’ అనే సినిమా చేస్తున్నారు. పూరీ జ‌గ‌న్నాథ్ గ‌తంలో క‌న్న‌డ భాష‌లో యువ‌రాజా, అప్పు, రోగ్ చిత్రాల‌ను తెర‌కెక్కించాడు. ఒక‌వేళ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్న‌ల్ ప‌డితే పూరీకి ఇది శాండ‌ల్‌వుడ్‌లో నాలుగో సినిమా కానుంది.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు