Home సినిమాలు 'పుష్ప రాజ్' కి ధీటుగా ఆర్య.. బన్నీని ఢీ కొట్టనున్న తమిళ స్టార్ హీరో

‘పుష్ప రాజ్’ కి ధీటుగా ఆర్య.. బన్నీని ఢీ కొట్టనున్న తమిళ స్టార్ హీరో

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక కథానాయిక. ఈ సినిమాలో పుష్పరాజ్‌ పాత్ర పోషిస్తున్నారు బన్నీ. పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది రష్మిక. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ ఇది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. కాగా.. పాన్ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో తమిళ హీరో ఆర్య పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టు సమాచారం. 

ఇదివరకే అల్లు అర్జున్, ఆర్య కలసి వరుడు అనే సినిమాలో నటించారు. ఈ జన్మ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్  తెచుకున్నప్పటికీ విలన్ గా ఆర్య అదరగొట్టాడు. ఇన్నేళ్ళ తర్వాత మరొకసారి అల్లు అర్జున్.. ఆర్య ఒకే సినిమా లో కనిపించనున్నారు. నిజానికి పుష్పలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టు తొలుత వార్తలు వచ్చాయి. అయితే డేట్స్ కుదరకపోవడంతో విజయ్ ఆ పాత్ర నుంచి తప్పుకున్నారట. దీంతో ఆ పాత్రకు తమిళ హీరో ఆర్యను చిత్ర యూనిట్ సంప్రదించినట్టు సమాచారం. తమిళ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని ఆ భాష నటులను చిత్రబృందం ఎంపిక చేసుకుంటోంది. మరోవైపు ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా ఓ స్పెషల్ సాంగ్ లో అలరించనున్న సంగతి తెలిసిందే.

కాగా.. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న పుష్ప చిత్రం ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుందీ. ‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత బన్నీ- సుకుమార్‌ మరోసారి కలిసి చేస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు