Home ప్రత్యేకం ‘పుష్ప’ మూవీ క్రేజీ అప్‌డేట్: కథను మలుపుతిప్పే పాత్రలో అనసూయ!

‘పుష్ప’ మూవీ క్రేజీ అప్‌డేట్: కథను మలుపుతిప్పే పాత్రలో అనసూయ!

బుల్లితెరపై యాంకర్‏గా రాణిస్తూనే.. అటూ వెండితెరపై తనదైన నటనతో అందరిని ఆకట్టుకుంటోంది హాట్ యాంకర్ అనసూయ.రామ్ చరణ్, సమంత హీరోహీరోయిన్లుగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త పాత్రతో ఒడిగిపోయింది అనసూయ. తాజాగా మళ్ళీ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు అనసూయ. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

అయితే ఈ పుష్ప చిత్రంలో అనసూయ చేసే పాత్ర పైనే ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఆమెకు కథను మలుపు తిప్పేలా సాలిడ్ రోల్ ను సుకుమార్ డిజైన్ చేశారట. గత చిత్రం రంగస్థలం లో ఎమోషనల్ గా ఆమె రోల్ ఉంటే ఈసారి పవర్ ఫుల్ గా డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. కాగా, అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 13న విడుదల కానుంది. ‘పుష్ప’ సినిమా కాకుండా రవితేజ ‘ఖిలాడి’,  కృష్ణవంశీ డైరెక్షన్‌లో వస్తున్న ‘రంగమార్తాండ’ చిత్రాల్లో నటిస్తున్నారు అనసూయ.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు