Home ప్రత్యేకం 'పుష్ప' మూవీ ఇంట్రస్టింగ్ అప్‌డేట్: బన్నీ సోదరి పాత్రలో టాలెంటెడ్ హీరోయిన్!

‘పుష్ప’ మూవీ ఇంట్రస్టింగ్ అప్‌డేట్: బన్నీ సోదరి పాత్రలో టాలెంటెడ్ హీరోయిన్!

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్‌గా కనిపించనున్నారు. బన్నీ సరసన రష్మిక నటించనుంది. ఫహద్‌ ఫాజిల్‌ వివోఎం పాత్రలో కనిపించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, అల్లు అర్జున్ కి సోదరి పాత్రలో కనిపించబోతుందట.. ఈమె క్యారెక్టర్ కి సంబంధించి ఒక ఎమోషనల్ ట్రాక్ సినిమాలో చాల కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర ఉంది. అయితే ఆ పోలీస్ పాత్రకు ఐశ్వర్య రాజేష్ పాత్రకు మధ్య కొన్ని సన్నివేశాలు ఉంటాయని.. ఆమె చావుకి అనుకోకుండా ఆ పోలీసే కారణం అవుతాడని.. దాంతో అతని పై అల్లు అర్జున్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది సినిమాలో హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. కాగా,  మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై ఈ చిత్రం నిర్మితమవుతోంది. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు