Home సినిమాలు 'పుష్ప' మూవీలో రంగమ్మత్త.. ఈసారి రచ్చ మాములుగా ఉండదట..!

‘పుష్ప’ మూవీలో రంగమ్మత్త.. ఈసారి రచ్చ మాములుగా ఉండదట..!

సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో అల్లు అర్జున్‌ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆల్లు అర్జున్‌ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఆగస్టు 13న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇదిలాఉంటే.. ‘పుష్ప’ లో హాట్ యాంకట్ అనసూయ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. “మంచి రోజులు ముందున్నాయి.. సుకుమార్‌తో మరో సినిమా చేయడం ఆనందంగా ఉంది’’ అని ‘పుష్ప’ షూటింగ్ లో పాల్గొంటున్న విషయాన్ని బుధవారం సోషల్‌ మీడియా ద్వారా ధ్రువీకరించారు అనసూయ.

కాగా, రంగస్థలం మూవీలో రంగమ్మత్తగా నటించిన అనసూయ ఫేట్ ఓవర్ నైట్ అమాంతం మారిపోయిన సంగతి తెలిసిందే. ఒకే ఒక్క సరైన అవకాశం ఎలా మార్చేస్తుందో అనసూయకు స్పష్ఠంగా అర్థమైంది. రంగమ్మత్తగా అనసూయ ఆహార్యం మాస్ అభిమానులకు పిచ్చెక్కించింది. ఆ తర్వాత కూడా మళ్లీ అనసూయను అలాంటి పాత్రలో చూడాలని అభిమానులు తాపత్రాయపడుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అనసూయ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. కోవిడ్ కేసుల పెరుగుదల మధ్య అదనపు జాగ్రత్తలు పాటిస్తూ ఆమె దృశ్యాలు హైదరాబాద్ లో చిత్రీకరించారట.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు