స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా, గురువారం అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా సినిమాలో బన్నీ స్టైలిష్ లుక్‌లో ఉన్న ఓ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో వైట్ షర్ట్ వేసుకొని నల్ల కల్లద్దాలతో.. బైక్‌పై కూర్చొని మాస్ లుక్ లో అల్లు అర్జున్ అదరగొట్టాడు.
అయితే ఈ పోస్టర్ ను చూసిన అల్లు అర్జున్ అభిమానులు ఓవైపు సంబరపడుతూనే.. మరోవైపు ఆందోళనలో పడుతున్నారు. ఎందుకంటే ఈ కొత్త పోస్టర్లో సినిమా విడుదల తేది లేదు. ఈ ఏడాది ఆగస్టు 13న సినిమాను పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే కరోనా వ్యాప్తి కారణంగా ఎన్నో సినిమాలు విడుదలను వాయిదా వేస్తున్నాయి. ఈ కారణంగానే ‘పుష్ప’ని కూడా వాయిదా వేస్తారా.. అందుకే కొత్త పోస్టర్‌పై విడుదల తేదీ వేయలేదా అని బన్నీ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. కాగా, పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో అల్లు అర్జున్ తొలిసారిగా పూర్తిస్థాయి మాస్ రోల్లో మెప్పించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంసెట్టి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.