Home ప్రత్యేకం పుష్ప: ఏదేమైనా తగ్గేదే లే అంటున్న అల్లు అర్జున్, సుకుమార్!

పుష్ప: ఏదేమైనా తగ్గేదే లే అంటున్న అల్లు అర్జున్, సుకుమార్!

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌, టాలెంటెడ్ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’.రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఎర్రచందనం స్మంగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నాడు. ఇటీవల విడుదల చేసిన పుష్పరాజ్‌ పాత్రకు సంబంధించిన వీడియో అభిమానుల తెగ ఆకట్టుకుంది
అయితే గతేడాది లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే సినిమా షూటింగ్ ఆలస్యం అయిన సంగతి తెలిసిందే.
అందుకే ఇప్పుడు చిత్రబృందం కరోనా సెకండ్ వేవ్ ఉదృతిని లెక్కచేయకుండా పని చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కరోనా మహమ్మారి కారణంగా ఉన్న పెద్ద సినిమాలన్నీ నిలిచిపోయాయి. కానీ అల్లు అర్జున్, సుకుమార్ మాత్రం ఏదేమైనా సరే సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా, ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు