Home సినిమాలు 'పుష్ప‌' సెట్స్‌లోకి 'ఆచార్య' ఎంట్రీ.. చిరుకి ఘ‌న‌స్వాగ‌తం ప‌లికిన అభిమానులు

‘పుష్ప‌’ సెట్స్‌లోకి ‘ఆచార్య’ ఎంట్రీ.. చిరుకి ఘ‌న‌స్వాగ‌తం ప‌లికిన అభిమానులు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ఎత్తున రూపొందుతోన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

కాగా, రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ నేటి (ఫిబ్రవరి 21) నుంచి తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ప్రారంభమవుతుంది. ఈ షూటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవికి ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో చిత్రీకరించనున్నారు. ఈ ఔట్ డోర్ షూటింగ్ మార్చి తొలి వారం వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు సమాచారం. చిరంజీవి సాహసోపేతమైన సన్నివేశాల్లో నటిస్తారట. కాగా, ఈ ప్రాంతంలో ఇటీవలే అల్లు అర్జున్ ‘పుష్ప’ షూటింగ్ జరిగింది. మొత్తానికి ఇద్దరు మెగా హీరోలు ఒకే చోట షూటింగ్ జరుపుకుంటున్న లోకేషన్ ను వెండితెరపై చూడాలని అభిమానులు  ఆరాటపడుతున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు