Home ప్రత్యేకం ‘పుష్ప’రాజ్ ఊచకోత.. బన్నీ ఖాతాలో మరో అరుదైన రికార్డు..

‘పుష్ప’రాజ్ ఊచకోత.. బన్నీ ఖాతాలో మరో అరుదైన రికార్డు..

‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత సుకుమార్‌, బన్నీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో హీరోహీరోయిన్లు చిత్తూరు యాసలో డైలాగ్స్‌ చెబుతారు. ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ పాన్‌ ఇండియా చిత్రంలో బన్నీ పాత్ర రఫ్‌గా ఉండబోతుంది. ఈ సినిమా టీజర్ లోనూ బన్నీ పుష్పరాజ్‌ అనే స్మగ్లర్‌గా మాస్‌ లుక్‌లో కనిపించాడు. ఇదిలాఉంటే.. బన్నీ బర్త్‌డే(ఏప్రిల్‌ 8) సందర్భంగా ‘పుష్ప’ లుక్ ను పరిచయం చేస్తూ టీజర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. తాజాగా ఈ టీజట్ ఓ సరికొత్త రికార్డును సాధించింది.
ఇప్పటి వరకు ‘పుష్ప’ టీజర్‌ 31 మిలియన్ల వ్యూస్‌, 9 లక్షల 40వేలకు పైగా లైకులు సంపాదించింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్ట్‌ర్‌ రిలీజ్ చేశారు. కాగా, అత్యంత తక్కువ సమయంలో పుష్ప టీజర్‌ 30 మిలియన్ల వ్యూస్‌ కైవసం చేసుకోవడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌.. లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా కనిపించనున్నారు. ఫహద్‌ ఫాజిల్‌ విలన్ గా కనిపించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా… మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్టు 13న విడుదల కానుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు