Home ప్రత్యేకం 'పుష్పరాజ్' ఆల్‌టైమ్‌ రికార్డు.. దటీజ్ అల్లు అర్జున్

‘పుష్పరాజ్’ ఆల్‌టైమ్‌ రికార్డు.. దటీజ్ అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఏప్రిల్‌ 7న బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రని పరిచయం చేస్తూ ఓ వీడియో పంచుకుంది చిత్ర బృందం. ‘ఇంట్రడ్యూసింగ్‌ పుష్పరాజ్‌’ పేరిట విడుదలైన ఈ వీడియో తాజాగా రికార్డు సృష్టించింది. అనతికాలంలో 70 మిలియన్‌ వీక్షణలు సొంతం చేసుకున్న వీడియోగా నిలిచింది.

ఈ మేరకు పుష్ప యూనిట్ ఓ ట్వీట్ వేసింది. 70 మిలియన్ల వ్యూస్‌ను మొదటిసారిగా, వేగంగా కొల్లగొట్టేసిన పుష్ప అంటూ ప్రకటించేశారు. ఇక ఇదే కాకుండా 1.6మిలియన్ల లైకులను సొంతం చేసుకుంది. తగ్గేదేలే అంటూ పుష్ప చిత్రబృందం వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కాగా, ఈ చిత్రంలో బన్ని సరసన రష్మిక నటిస్తోంది. ఫహద్‌ ఫాజిల్‌ విలన్ గా కనిపించనున్నారు. ‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత బన్నితో సుకుమార్ తెరకెక్కిస్తోన్న సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు