Home సినిమాలు ‘పుష్ప’రాజ్‌ డబ్బింగ్‌ మొదలెట్టాడు.. కథ మామూలుగా ఉండదు అంటోన్న ఫ్యాన్స్

‘పుష్ప’రాజ్‌ డబ్బింగ్‌ మొదలెట్టాడు.. కథ మామూలుగా ఉండదు అంటోన్న ఫ్యాన్స్

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, రష్మిక జంటగా నటిస్తున్న సినిమా ‘పుష్ప’. ‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం కావడంతో ‘పుష్ప’పై భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప సినిమాలో స్మగ్లర్‌ పుష్పరాజ్‌ పాత్రలో అల్లుఅర్జున్‌ కనిపించనున్నారు. అయితే తాజాగా ‘పుష్ప’ డబ్బింగ్ కార్యక్రమాలను చిత్రబృందం మొదలు పెట్టేసారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరున్న ఈ సినిమాను ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ‘పుష్ప’ ద్వారా అల్లు అర్జున్ హిందీ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నారు. ‘పుష్ప’ను పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ ఏడాది ఆగస్టు 13న విడుదల చేయనున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు