Home వార్తలు పీఎస్‌ఎల్‌వీ సీ51 ప్రయోగం సక్సెస్.. నింగిలోకి దూసుకెళ్లిన భగవద్గీత, 19 ఉపగ్రహాలు

పీఎస్‌ఎల్‌వీ సీ51 ప్రయోగం సక్సెస్.. నింగిలోకి దూసుకెళ్లిన భగవద్గీత, 19 ఉపగ్రహాలు

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌అంతరిక్ష కేంద్రం నుంచి చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సి-51 రాకెట్‌ ప్రయోగం సక్సెస్ అయింది. దేశీయ, ప్రైవేటు సంస్థలకు చెందిన 19 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్టు ఇస్రో అధికారికంగా ప్రకటించింది.  ఆదివారం ఉదయం 10.24 గంటలకు ధ్రువ ఉపగ్రహ ప్రయోగ వాహకనౌక-సి51 (పీఎస్‌ఎల్‌వీ) ఆకాశంలోకి  నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. ప్రయోగ వేదిక నుంచి రాకెట్‌ 17 నిమిషాల పాటు పయనించి బ్రెజిల్‌కు చెందిన అమోజోనియా శాటిలైట్‌ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 
కాగా, పీఎస్‌ఎల్‌వీ శాటిలైట్‌ దేశీయ, ప్రైవేటు సంస్థలకు చెందిన 19 ఉపగ్రహాలను, భగవద్గీత కాపీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో, పేరు, ఆత్మనిర్భర్‌ మిషన్‌ పేరు సహా 25 వేల పేర్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ఇందులో విదేశాలకు చెందిన వెయ్యి మంది, చెన్నైకి చెందిన విద్యార్థుల పేర్లు సైతం ఉన్నాయి. శ్రీహరికోటలోని షార్​ నుంచి జరిగిన ఈ ప్రయోగాన్ని బ్రెజిల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి మార్కోస్ క్వాంటస్ ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్‌ శివన్‌ మాట్లాడుతూ ఇస్రో, బ్రెజిల్ అనుసంధానంతో తొలిప్రయోగం నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా బ్రెజిల్ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు