Home సినిమాలు 'పాగ‌ల్' నుండి అదిరిపోయే అప్‌డేట్.. వైర‌ల్‌గా మారిన పోస్టర్‌

‘పాగ‌ల్’ నుండి అదిరిపోయే అప్‌డేట్.. వైర‌ల్‌గా మారిన పోస్టర్‌

యంగ్ హీరో విశ్వక్ సేన్ రూటు మార్చినట్లు ఆయన లేటెస్ట్ మూవీ ‘పాగల్’ టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విశ్వక్ సేన్.. ‘ఫ‌ల‌క్ నామా దాస్’ సినిమాతో మాస్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేశాడు. ఆ తర్వాత హీరో నాని నిర్మించిన ‘హిట్‌’ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు ‘పాగల్’ అనే మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విశ్వక్ సేన్.

గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా నుండి మ‌రో కొత్త పోస్ట‌ర్ విడుద‌ల చేస్తూ ఆసక్తిక‌ర విష‌యాన్ని తెలియ‌జేశారు. పాగ‌ల్ చిత్రంలో నివేదా పెతురాజ్ .. తీరా అనే క్యారెక్ట‌ర్ పోషిస్తుంద‌ని తెలియ‌జేస్తూ ఆమె ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ లో నివేదా ..విశ్వ‌క్ సేన్‌ను హగ్ చేసుకొని తదేకంగా చూస్తుంది. హీరో చేతుల‌ని క‌ట్టివేసి ఉండ‌డం ఈ సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తుంది.

నరేష్ కుప్పిలి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ‘పాగల్’ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ రాధన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేశారు. వేసవి కానుకగా మే1న ఈ సినిమాను భారీ రేంజ్‌లో ప్రేక్షకుల ముందుకు తేవాలని ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు