Home ప్రత్యేకం పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. మార్చి 29న రానున్న ‘వకీల్‌ సాబ్’‌ ట్రైలర్‌

పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. మార్చి 29న రానున్న ‘వకీల్‌ సాబ్’‌ ట్రైలర్‌

పవర్‌ఫుల్‌ లాయర్‌ పాత్రలో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్‌ సాబ్’‌. ఈ సినిమాను శ్రీరామ్‌ వేణు తెరకెక్కిస్తుండగా.. బోనీ కపూర్‌ సమర్పణలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. దాదాపు మూడేళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌ ని చిత్రబృందం వెల్లడించింది. మార్చి 29న ‘వకీల్ సాబ్’ చిత్ర ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.

ఇక బాలీవుడ్‌లో హిట్‌ సాధించిన పింక్‌ చిత్రాన్ని తెలుగులో వకీల్‌సాబ్‌గా రీమేక్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. పింక్’లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను ‘వకీల్ సాబ్’లో పవన్ కల్యాణ్ పోషిస్తుండడంతో సినిమాకు భారీ హైప్ క్రియెట్‌ అయ్యింది. అలాగే మూడేళ్ల గ్యాప్‌ తర్వాత పవన్ నుంచి వస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు