Home సినిమాలు పవర్ స్టార్ అభిమానులు సిద్ధంగా ఉండండి.. 'వకీల్‌సాబ్’ ట్రైలర్‌ రిలీజ్ టైమ్‌ ఇదే!

పవర్ స్టార్ అభిమానులు సిద్ధంగా ఉండండి.. ‘వకీల్‌సాబ్’ ట్రైలర్‌ రిలీజ్ టైమ్‌ ఇదే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని మరోసారి వెండితెరపై చూసే ఆ సమయం ఆసన్నమవుతోంది. ఆయన రీ- ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ ఏప్రిల్ 9వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి చేస్తోంది చిత్రయూనిట్. ఇందులో భాగంగా ఇటీవలే తన పాత్ర కోసం డబ్బింగ్‌ చెప్పడం ప్రారంభించిన పవన్ కళ్యాణ్‌.. శనివారంతో ఆ పని పూర్తి చేసేశారు. ఇదిలాఉంటే ఈనెల 29న సాయంత్రం 6గంటలకు ట్రైలర్‌ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు.
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ రీమేక్‌గా భారీ హంగులతో తెరకెక్కుతున్న ఈ ‘వకీల్ సాబ్’ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీకపూర్ సమర్పకులుగా వ్యవహరిస్తుండగా.. దిల్ రాజు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. పవన్ రీ- ఎంట్రీ మూవీ కావడంతో ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకుంటున్న దర్శకనిర్మాతలు పవన్ ఫ్యాన్స్ ఊగిపోయేలా కొన్ని సినిమాను చిత్రీకరించారట.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు