పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వకీల్ సాబ్’. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. అంచనాలు ఎలా ఉన్నాయనడానికి తాజాగా విడుదలైన ట్రైలర్ సృష్టించిన, సృష్టిస్తోన్న ప్రభంజనమే సాక్ష్యం. వ్యూస్, లైక్స్ పరంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను, ఇంతకు ముందు టాలీవుడ్ ఇండస్ట్రీలో లేని రికార్డులను ఈ ట్రైలర్ క్రియేట్ చేసింది.
కాగా, ‘వకీల్‌సాబ్’ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకకు జూబ్లీహిల్స్ పోలీసులు అనుమతి నిరాకరించారు. దింతో యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లోని స్పోర్ట్స్ గ్రౌండ్స్‌లో ఏప్రిల్ 3వ తేదీన నిర్వహించ తలపెట్టిన వకీల్‌సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బ్రేక్ పడినట్లయింది. వకీల్‌సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను జె.మీడియా ఫ్యాక్టరీ నిర్వహించాలని తలపెట్టి ఇందుకోసం జూబ్లీహిల్స్ పోలీసులకు అనుమతి మంజూరు కోరుతూ లేఖ రాశారు. అయితే కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న నేపథ్యంలో ఎలాంటి సభలు, సమావేశాలకు అనుమతులు లేవని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఇటీవలనే జీవో జారీ చేశారు. ఆ జీవో ప్రకారం వకీల్‌సాబ్ సిని మా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు అనుమతి నిరాకరించినట్లు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.