Home సినిమాలు పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్.. టైటిల్, ఫ‌స్ట్ లుక్ రిలీజ్ డేట్‌ ఫిక్స్‌

పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్.. టైటిల్, ఫ‌స్ట్ లుక్ రిలీజ్ డేట్‌ ఫిక్స్‌

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా అటు రాజకీయాలు, ఇటు సినిమా షూటింగ్స్ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు పవన్. ఈ నేపథ్యంలో ఇటీవలే తన ‘వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తి చేసిన ఆయన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు.

‘వకీల్ సాబ్’ షూటింగ్ ఫినిష్ కావడంతో మళయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా తెలుగు రీమేక్‌‌ సెట్స్ పైకి వచ్చేశారు పవన్ కళ్యాణ్. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఈ మూవీతో పాటు ఒకేసారి క్రిష్ సినిమాను పూర్తి చేయాలని ఫిక్సయ్యారట పవన్. ఇందులో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగ పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. ఈ చిత్రానికి ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్‌ ఖరారు చేసినట్లుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

కాగా, మెగా సూర్య ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ను చిత్రయూనిట్‌ అధికారికంగా విడుదల చేసేందుకు డేట్‌ ఫిక్స్‌ చేసింది. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ను మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 11న విడుదల చేయబోతోన్నట్లుగా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ అదరిపోయిందనే టాక్‌ వస్తున్న నేపథ్యంలో అభిమానులు ఎప్పుడెప్పుడు ఫస్ట్ లుక్‌ వదులుతారా అని ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. మహాశివరాత్రికి అని చిత్రబృందం అధికారికంగా చెప్పడంతో పవర్ స్టార్ అభిమానులు ట్రెండింగ్‌ కోసం ట్యాగ్‌లను రెడీ చేసే పనిలో ఉన్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు