Home సినిమాలు పవర్‌స్టార్ తో సినిమా చేస్తా.. పవన్‌తో‌ విభేదాల వార్తలపై అలీ క్లారిటీ

పవర్‌స్టార్ తో సినిమా చేస్తా.. పవన్‌తో‌ విభేదాల వార్తలపై అలీ క్లారిటీ

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, ప్రముఖ హాస్యనటుడు ఆలీ.. మంచి స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏర్పడిన రాజకీయ పరిణామాలతో వీరిద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చిందని గతంలో పలువురు చెప్పుకున్నారు. అంతేకాకుండా, దాదాపు ఏడాదిన్నరపాటు వీరిద్దరూ కలవలేదు. ఈ క్రమంలో తాజాగా ఆలీ కుటుంబంలో జరిగిన ఓ వివాహ వేడుకకు పవన్‌ హాజరయ్యారు. ఆలీతో సరదాగా మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలీ.. పవన్‌తో విభేదాల గురించి స్పందించారు..”సుస్వాగతం” సినిమాతో మా మధ్య స్నేహం ప్రారంభమైంది. ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ 27 సినిమాలు చేస్తే.. 25 చిత్రాల్లో నేను ఉన్నాను. మా ఇద్దరి మధ్య రాజకీయపరంగా తప్ప వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలూ లేవు. ఇటీవల మా బంధువుల పెళ్లిలో పవన్‌ను కలిశాను. చాలా సంతోషంగా అనిపించింది. రాజకీయాలు, కరోనా కారణంగా ఏడాదిన్నర నుంచి ఆయణ్ని కలవలేకపోయాను.  మధ్యలో ఒకసారి ఆయణ్ని కలుద్దామని ఇంటికి వెళ్లాను. అప్పుడు ఆయన పుణెలో ఉన్నారని తెలిసి వచ్చేశాను. పవన్ మళ్లీ ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. అన్నీ కుదిరితే ఈ ఏడాదే పవన్ సినిమాలో నేను కనిపిస్తానని” అలీ చెప్పుకొచ్చారు.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు