తెలుగు చిత్రసీమలో పవన్ కల్యాణ్- హరీశ్ శంకర్ ఈ కాంబినేషన్‌కి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ‘గబ్బర్ సింగ్’తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది ఈ జోడీ. అంతటి భారీ హిట్ తర్వాత ఈ ఇద్దరు కలిసి మరో సినిమా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ‘పీఎస్పీకే 28’ వర్కింగ్ టైటిల్‌తో కథని పక్కాగా సిద్ధం చేస్తున్నారు హరీశ్. ‘గబ్బర్‌సింగ్’లా వినోదాన్ని పంచుతూనే సోషల్ మెసేజ్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.
కాగా, పవన్ – హరీష్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకి ‘సంచారి’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అంతకుముందు కాన్సెప్ట్ పోస్టర్ తోనే ఆసక్తిని కలిగించిన హరీష్.. ఇప్పుడు ‘సంచారి’ అనే టైటిల్ ని పెడుతున్నాడంటే ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం పవర్ స్టార్ అటు క్రిష్ డైరక్షన్ లో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. ఇటు సాగర్ డైరక్షన్ లో అయ్యప్పన్ కోషియామ్ సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు. దీనికి త్రివిక్రమ్, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత హరీశ్ శంకర్ డైరక్షన్ లో సినిమాని ప్రారంభించనున్నాడు పవన్ కళ్యాణ్. కాగా, మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.