పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన తాజా చిత్రం వకీల్‌సాబ్ ఏప్రిల్ 9న విడుదలకు సిద్ధంగా ఉంది. అదే విధంగా దర్శకుడు క్రిష్, పవన్ కాంబినేషన్లో ‘హరిహర వీరమల్లు’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అలాగే పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటిలు ఓ మల్టిస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ రెండు సినిమాలని ఒకేసారి చేస్తున్న పవన్ తన తర్వాతి సినిమా హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోతుండగా గత కొన్ని రోజులుగా ఈ సినిమా కథా నేపథ్యం ఏంటో అన్న ఆసక్తి అందరిలోనూ కలుగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం దర్శకుడు హరీష్ శంకర్ ఒక పవర్ ఫుల మాస్ కథను రెడీ చేసి పవన్ కళ్యాణ్ కు వినిపించినట్టుగా తెలుస్తోంది. హరీష్ శంకర్ చెప్పిన స్టోరీ కూడా పవన్‌కి నచ్చడంతో ఈ సినిమా షూటింగ్‌కి సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాల చిత్రీకరణ పూర్తయిన వెంటనే హరీష్ శంకర్ తో సినిమా చేయనున్నట్లు సమాచారం. ఏదేమైనా కూడా ఈ పవర్ బ్లాస్టింగ్ కాంబినేషన్ కోసం అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.