Home ప్రత్యేకం పవన్-హరీష్ శంకర్ మూవీకి ఇంట్రెస్టెంట్ టైటిల్ ఫిక్స్!

పవన్-హరీష్ శంకర్ మూవీకి ఇంట్రెస్టెంట్ టైటిల్ ఫిక్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో సినిమా ఫిక్సయిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కలయికలో గతంలో ‘గబ్బర్ సింగ్’ సినిమా వచ్చింది. అయితే చాలా ఏళ్ల తర్వాత  ఈ  క్రేజీ కాంబో ఫిక్స్ అయ్యింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా మరికొన్ని నెలల్లో సెట్స్‌పైకి వెళ్లనుంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘సంచారి’ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అలాగే ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని కూడా వార్త‌లు హల్చల్ చేస్తున్నాయి. ఇదిలాఉంటే.. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వకీల్‌సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో బోనీ కపూర్‌, దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్‌ చిత్రం ‘పింక్‌’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతోంది. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్‌కళ్యాణ్‌ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ఈ సందేశాత్మక చిత్రం విజయవంతంగా దూసుకెళ్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు