Home సినిమాలు పవన్ 'హరిహర వీరమల్లు’ విడుదలయ్యేది అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన చిత్రబృందం!

పవన్ ‘హరిహర వీరమల్లు’ విడుదలయ్యేది అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన చిత్రబృందం!

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం క్రిష్‌ డైరెక్షన్లో‌ ‘హరిహర వీరమల్లు’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పిరియాడికల్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ ఇప్పటికే చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఎ.ఎం.రత్నం సమర్పణలో పాన్‌ ఇండియా చిత్రంగా ఎ.దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో పవన్‌ సరసన నిధి అగర్వాల్‌, బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా చాలా సినిమాలు షూటింగ్‌తో పాటు విడుదల తేదీలను సైతం వాయిదా వేసుకుంటున్నాయి. తాజాగా హరిహర వీరమల్లు సినిమా కూడా వాయిదా పడనుందని కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై నిర్మాత ఎ.ఎం.రత్నం స్పందించారు.. ‘‘హరిహర వీరమల్లు చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికే కచ్చితంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని స్పష్టం చేశారు. దర్శకుడు క్రిష్‌ అనుకున్న సమయానికి చిత్రాన్ని పూర్తి చేస్తారు. సంక్రాంతి పండగ అంటే ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది. కాబట్టి అనుకున్న సమయానికే సినిమాను విడుదల చేస్తాం’’ అని ఆయన వెల్లడించారు

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు