Home సినిమాలు పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్: హోరెత్తించే 'వకీల్‌ సాబ్‌' ప్రమోషనల్ సాంగ్‌ రెడీ

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్: హోరెత్తించే ‘వకీల్‌ సాబ్‌’ ప్రమోషనల్ సాంగ్‌ రెడీ

పవన్‌కళ్యాణ్‌ హీరోగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. ఏప్రిల్‌ 9న ఈ సినిమా విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ‘వకీల్‌ సాబ్‌’ ట్రైలర్‌ 23 మిలియన్‌ వ్యూస్‌ దక్కించుకుంది. ఈ సినిమా ట్రైలర్‌ వన్‌ మిలియన్‌ లైక్స్‌ను సాధించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును సృష్టించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ‘వకీల్‌ సాబ్‌’ కోసం ఓ ప్రమోషనల్‌ సాంగ్‌ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట

ఈ నేపథ్యంలో ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ స్పెషల్ సాంగ్ ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. ఏప్రిల్ 3న తలపెట్టిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అనుమతి లేకపోవడంతో సినిమా యూనిట్ సభ్యులతో ఏప్రిల్ 4న ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సందర్భంగా ‘వకీల్ సాబ్’ ప్రమోషనల్ సాంగ్ విడుదల చేసే అవకాశం ఉంది. థమన్ స్పెషల్ కేర్ తీసుకొని కంపోజ్ చేసిన ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.

కాగా, శ్రీవేంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజ్‌, శిరీశ్‌ ఈ సినిమాను నిర్మిస్తుండగా తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. బోనీ కపూర్‌ సమర్పణలో చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ఏప్రిల్‌ 9వ తేదీన భారీ స్థాయిలో విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ డిజిటల్ రైట్స్ ను తీసుకోగా.. శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు కొనేసింది. ఈ సినిమాపై పవన్‌ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

ఖరీదైన వాచ్‌తో మెరిసిన మెగాపవర్ స్టార్.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు భావిస్తుంటారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...

‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే ఊడ్చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ...

విడుదలకు ముందే ‘ఆచార్య’కు గట్టి ఎదురుదెబ్బ.. ఊహించని షాక్ లో చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన చందమామ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన కుమారుడు, మెగాపవర్‌...

అల్లు అర్జున్‌ అభిమానులకు భారీ షాక్.. ‘పుష్ప’ సినిమా విడుదల వాయిదా!

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ మూవీ ‘పుష్ప’. ఇటీవలె విడుదల అయిన పుష్ప టీజర్‌ ప్రస్తుతం  టీజర్‌...ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్‌,1 మిలియన్...

ఇటీవలి వ్యాఖ్యలు