పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘వకీల్ సాబ్’. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాత. సినిమా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇదిలాఉంటే.. ‘వకీల్‌సాబ్’ ప్రమోషన్లో భాగంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వేణు శ్రీరామ్ పాల్గొని చిత్రానికి సంబంధించిన ఎన్నో విశేషాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు దర్శకుడు వేణు శ్రీరామ్. వకీల్ సాబ్ లో నటించడానికి పవన్ నో చెబితే.. తాను ఎవరిని ఎంపిక చేసుకుంటాడో చెప్పి సర్ ప్రైజ్ చేశారు.
ఒకవేళ ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ నో చెప్పి ఉంటే.. ఎవరిని సెలక్ట్ చేసుకుంటారు అని అడిగిన ప్రశ్నకు తాను కింగ్ అక్కినేని నాగార్జునను ఎంపిక చేసుకుంటానని చెప్పాడు దర్శకుడు వేణు శ్రీరామ్. ” పవన్ ఈ చిత్రానికి అంగీకరించక పోయుంటే నేను కచ్చితంగా నాగార్జున గారిని ఎంపిక చేసుకునే వాడిని. ఆయనలాంటి నటుడు ఈ సినిమాకి చక్కగా సరిపోతాడు” అని వేణు శ్రీరామ్ పేర్కొన్నాడు. అలాగే, పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. వాస్తవానికి ఇది నా కళ. నాకే కాదు ఏ దర్శకుడికైనా ఆయనతో సినిమా చేయాలనే డ్రీమ్ ఉంటుంది. ఎందుకంటే ఆయనో అద్భుతమైన నటుడు. ‘వకీల్‌సాబ్’ షూటింగ్ జరిగినన్ని రోజులు నేను ఎంతగానో సంతోషించాను. అని వేణు శ్రీరామ్ వివరించారు.