Home సినిమాలు పవన్ కళ్యాణ్ సినిమాకు నో చెప్పిన 'ఫిదా' బ్యూటీ సాయిపల్లవి!

పవన్ కళ్యాణ్ సినిమాకు నో చెప్పిన ‘ఫిదా’ బ్యూటీ సాయిపల్లవి!

రెండేళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత తిరిగి కెమెరా ముందుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జెట్ స్పీడుతో సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. ఇటీవలే తన ‘వకీల్ సాబ్’ షూటింగ్ ఫినిష్ చేసిన ఆయన తాజాగా ఇటీవల దగ్గుబాటి రానాతో కలిసి చేయబోతున్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రీమేక్ సెట్స్ పైకి వచ్చేశారు. ఇకపోతే ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తుండటం విశేషం. ప్రముఖ నటులు సముద్రఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

అయితే ఈ సినిమాలో ప‌వ‌న్ కళ్యాణ్ స‌ర‌స‌న హీరోయిన్‌గా సాయి ప‌ల్ల‌విని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ క్రేజీ ఆఫర్‌ను సాయి పల్లవి వదులుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం సాయి పల్లవి వరుస సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా తన డేట్స్ పవన్ సినిమాకు కేటాయించడం కష్టమని చెప్పిందట. బాగా ఆలోచించి చివరగా కుదరదని చెప్పి ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేగాక ఈ సినిమాలో తన పాత్ర నిడివి కూడా చాలా తక్కువగా ఉందని సాయిపల్లవి భావించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మరో హీరోయిన్ కోసం వెతుకులాట ప్రారంభించారట దర్శక నిర్మాతలు.

కాగా, సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు సాగర్‌ కె.చంద్ర దర్శకుడు. పవన్‌ కల్యాణ్, రానా కాంబినేషన్‌లో హైదరాబాద్‌లో యాక్షన్‌ సీన్స్‌ తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: ప్రసాద్‌ మూరెళ్ళ.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు