Home ప్రత్యేకం పవన్ కళ్యాణ్ "వ‌కీల్ సాబ్" మ్యూజిక్ ఫెస్టివ‌‌ల్ జ‌రిగే ప్రాంతాలు ఇవే..!

పవన్ కళ్యాణ్ “వ‌కీల్ సాబ్” మ్యూజిక్ ఫెస్టివ‌‌ల్ జ‌రిగే ప్రాంతాలు ఇవే..!

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘వకీల్‌ సాబ్’‌ చిత్రం ఉగాది కానుకగా ఏప్రిల్‌ 9న థియేటర్లలో రిలీజ్‌ కానున్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌మోష‌న్స్ కూడా ప్రారంభమయ్యాయి. తాజాగా వకీల్‌సాబ్ మ్యూజిక్ ఫెస్టివ‌ల్ న్యూస్ లైమ్‌లైట్‌లోకి వ‌చ్చింది. వ‌కీల్‌సాబ్ మ్యూజిక్ ఫెస్ట్‌ను చిత్రబృందం మార్చి 23న వైజాగ్‌లోని విజ్ఞాన్ కాలేజ్ ఉద‌యం (10 గంట‌లు), కాకినాడ‌లోని కైట్ కాలేజ్‌(మ‌ధ్యాహ్నం 3.30 గంట‌లు) లో నిర్వ‌హించ‌నున్నారు.

చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్‌, సంగీత దర్శకుడు థ‌మ‌న్‌, పాటల రచయిత రామ‌జోగయ్య శాస్త్రి, ఇత‌ర చిత్ర సభ్యులు ఈ ఈవెంట్‌కు హాజ‌రుకానున్నారు. ఈ సారి చిత్రబృందం కాలేజీ యువతను ఆక‌ట్టుకునే ల‌క్ష్యంతో ముందుకెళ్తుంది. కాగా.. ఈ సినిమాలో ఇందులో పవర్‌ స్టార్‌ తొలిసారిగా వకీల్‌గా భిన్న పాత్ర పోషించారు. హిందీలో వచ్చిన ‘పింక్’ చిత్రాన్ని తెలుగులో ‘వకీల్ సాబ్’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా రూపొందిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు