Home సినిమాలు పవన్ కళ్యాణ్- రానా కొత్త సినిమాపై క్రేజీ అప్‌డేట్..!

పవన్ కళ్యాణ్- రానా కొత్త సినిమాపై క్రేజీ అప్‌డేట్..!

మలయాళ సూపర్‌హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు.అక్కడ బిజు మేనన్‌, పృథ్వీరాజ్‌లు పోషించిన పాత్రలను ఇక్కడ తెలుగులో పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్, యువ కథానాయకుడు రానా పోషిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించనుండగా.. కథానాయికలుగా సాయి పల్లవి, ఐశ్వర్యరాజేశ్‌లు ఎంపికయ్యారు.తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.


భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా  రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నట్లు  సమాచారం. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ కోసం ఇప్పటికే హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో విశాలమైన లాడ్జ్ సెట్‌ను వేశారు. జనవరి 20 నుంచి  25 రోజులు పాటు ఈ సినిమా షూటింగ్ ఈ సెట్ లో జరగనుంది. ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్,రానా లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో రానా,  పవన్ కళ్యాణ్ దాదాపు 70 శాతం తెరపై కలిసి కనిపించనున్నారని.. ఈ సినిమాకు బిల్లా రంగా అనే టైటిల్ పరిశీలిస్తున్నారని సమాచారం.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు