Home ప్రత్యేకం పవన్ కళ్యాణ్ దెబ్బకు బద్దలైన ‘బాహుబలి 2’ రికార్డ్

పవన్ కళ్యాణ్ దెబ్బకు బద్దలైన ‘బాహుబలి 2’ రికార్డ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ట్రైలర్ విడుదలై ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. ఈ ట్రైలర్‌ను అన్ని తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఏరియాల్లో థియేటర్లలో ప్లే చేశారు. థియేటర్లలో ఈ ట్రైలర్‌ను చూసేందుకు మెగాభిమానులు ఎలా ఎగబడ్డారో.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ అవుతున్న వీడియోలు చూస్తే తెలిసిపోతుంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన సెంటర్ల థియేటర్లలో ‘వకీల్ సాబ్’ సినిమా ట్రైలర్ గ్రాండ్‌గా విడుదలైంది.
కాగా, ఈ సినిమా ట్రైలర్ విడుదలైన కొద్దిసేపట్లోనే పాత రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటివరకు తక్కువ టైంలో అత్యధిక లైక్స్ సాధించిన ట్రైలర్ గా ‘బాహుబలి 2’ ఉండేది. ‘బాహుబలి -2’ పదిన్నర గంటల్లో 4 లక్షల లైక్స్ సాధిస్తే ‘వకీల్ సాబ్’ మాత్రం 71 నిముషాల్లోనే 4 లక్షల లైక్స్ టార్గెట్ కొట్టేసింది. ఇక 5 లక్షల లైక్స్ టార్గెట్ 115 నిముషాల్లోనే ఛేదించాడు పవర్ స్టార్. ఈ జోరు చూస్తుంటే 24 గంటల్లో మిలియన్ లైక్స్ లక్ష్యాన్ని చేదించేలా కనిపిస్తోంది. మొత్తానికి పవన్ రీఎంట్రీ ఆరంభంలోనే అదిరిపోయింది. ఇక సినిమా విడుదలయ్యాక వసూళ్ల సునామీ ఎలా ఉంటుందో అన్నది చూడాలి.
ఇక శ్రీవేంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజ్‌, శిరీశ్‌ ఈ సినిమాను నిర్మిస్తుండగా తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. బోనీ కపూర్‌ సమర్పణలో చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ఏప్రిల్‌ 9వ తేదీన భారీ స్థాయిలో విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ డిజిటల్ రైట్స్ ను తీసుకోగా.. శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు కొనేసింది. ఈ సినిమాపై పవన్‌ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

‘వకీల్ సాబ్’ తొలి వారం వసూళ్లు.. బాక్సఫీసు వద్ద పవర్ స్టార్ ప్రభంజనం!

పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ వెంకటేశ్వర...

ప్రభాస్ ‘సలార్‌’ మూవీ నుండి క్రేజీ అప్‌ డేట్‌

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ప్రధాన పాత్రలో ‘కేజీయఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌నీల్‌ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’. పాన్‌ ఇండియన్‌ చిత్రంగా తెరకెక్కనున్న ‘సలార్‌’లో ప్రభాస్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. అయితే ఈ...

మహేష్-త్రివిక్రమ్ మూవీ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్షేషనల్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.  అయితే ప్రస్తుతం మహేష్ బాబు 'సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్‌తో బిజీగా...

‘అఖండ’గా బాలయ్య గర్జన.. ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న పవర్ ప్యాక్డ్ టీజర్

'సింహా', 'లెజెండ్‌' చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూడో చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించారు...

ఇటీవలి వ్యాఖ్యలు