Home ప్రత్యేకం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై తాజా బులెటిన్ విడుదల

పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై తాజా బులెటిన్ విడుదల

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.. ఇటీవల అస్వస్థతకు లోనైన సమయంలో కరోనా పరీక్షలు చేయించుకోగా తొలుత ఫలితాలు నెగిటివ్‌గా వచ్చాయి. దీంతో డాక్టర్ల సలహా మేరకు తన వ్యవసాయక్షేత్రంలో క్వారంటైన్‌కు వెళ్లాడు. అయితే అప్పటి నుంచి కొద్దిపాటి జ్వరం, ఒళ్లునొప్పులు ఆయనను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. దీంతో మరోసారి కోవిడ్‌ పరీక్షలు జరపగా పాజిటివ్‌ అని తేలింది. అయితే పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవితో పాటు సురేఖ, రామ్‌చరణ్‌, ఉపాసన, నిర్మాత నాగవంశీలు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు. అపోలో నుంచి కూడా ఒక వైద్య బృందం పవన్‌ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.
కాగా, ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని పవన్ చెప్పారని జనసేన పార్టీ తాజాగా విడుదల చేసిన  లేఖలో పేర్కొంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అంతే కాకుండా పవన్ కోసం ప్రార్ధనలు జరిపిన ప్రతీ ఒక్క అభిమానికి తన ఆరోగ్యం పట్ల స్పందించిన ప్రతీ ఒక్క నటులు సహా రాజకీయ నాయకులకు ధన్యవాదాలు పవన్ తెలిపారు. అంతే కాకుండా ప్రభుత్వం కూడా కరోనా పట్ల అప్రమత్తగా ఉండాలని ప్రతి ఒక్కరు మాస్కులు శానిటైజర్ లు తప్పనిసరిగా వినియోగిచాలని పవన్ కళ్యాణ్ సూచించారు. దీంతో పవన్ కళ్యాణ్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు