Home సినిమాలు పవన్‌-రానా మూవీ: పవన్‌తో జోడీ కట్టనున్న నిత్యామీనన్‌!

పవన్‌-రానా మూవీ: పవన్‌తో జోడీ కట్టనున్న నిత్యామీనన్‌!

పవన్ కల్యాణ్‌, రానా ప్రధానపాత్రల్లో మలయాళీ హిట్‌ సినిమా ‘అయ్యప్పనమ్‌ కోషియమ్‌’ తెలుగు రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అక్కడ బిజు మేనన్‌, పృథ్వీరాజ్‌లు పోషించిన పాత్రలను ఇక్కడ తెలుగులో పవన్‌, రానా పోషిస్తున్నారు. ఇటీవలే  ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది.

అయితే ఈ సినిమాలో పవన్ కు జోడీగా నిత్యామీనన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. చిత్రబృందం తొలుత సాయి పల్లవిని  అనుకున్నా తన డేట్స్‌ కుదరక పోవడంతో సెట్‌ కాలేదు. తరువాత వారు నిత్యా మీనన్‌ను సంప్రదించగా , ఆమె వెంటనే అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన రానుంది. మరోవైవు ఈ సినిమాలో రానా సరసన కోలివుడ్‌ నటి  ఐశ్వర్య రాజేష్‌ను మరో  హీరోయిన్‌గా ఎంపిక  చేశారు.

కాగా, సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ స్కీన్‌ప్లే, సంభాషణలు అందిస్తుండటం విశేషం. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సముద్రకని, బ్రహ్మజీ, మురళీశర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు