Home సినిమాలు పవన్‌-రానా మూవీ: కీలక పాత్రలో కనిపించనున్న స్టార్ డైరెక్టర్

పవన్‌-రానా మూవీ: కీలక పాత్రలో కనిపించనున్న స్టార్ డైరెక్టర్

పవన్‌ కల్యాణ్, రానా కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ జనవరి 25న ఆరంభమైంది. సాగర్‌ కె.చంద్ర దర్శకుడు.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్‌ స్క్రీన్‌ ప్లే– సంభాషణలు అందిస్తున్నారు. సముద్ర ఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: ప్రసాద్‌ మూరెళ్ళ.సాయి పల్లవి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. తొలి షెడ్యూల్ షూటింగ్‌లో ఫైట్ మాస్టర్ దిలీప్ సబ్బరాయన్ నేతృత్వంలో ప్రస్తుతం పవన్- రానా మధ్య పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

అయితే, తాజా సమాచారం ప్రకారం పవన్‌, రానా సినిమాలో మరో స్టార్ డైరెక్టర్‌ నటించనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లో ఫ్యాక్షన్‌, యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన వి.వి.వినాయక్‌ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది..ఇప్పటికే ఈయన పాత్రకు సంబంధించిన పార్ట్ షూటింగ్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కొంతమేర జరిగిందని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్‌మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా..దర్శకుడిగా పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆయన, వీలు చిక్కినప్పుడల్లా వెండితెరపై మెరుస్తున్నారు. ఇలా గతంలో ఠాగూర్’, ‘ఖైదీ నెంబర్ 150’ వంటి చిత్రాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు