Home సినిమాలు పవన్‌-రానా మూవీ: ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఇదే!

పవన్‌-రానా మూవీ: ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఇదే!

పవన్ కల్యాణ్‌, రానా ప్రధానపాత్రల్లో మలయాళీ హిట్‌ సినిమా ‘అయ్యప్పనమ్‌ కోషియమ్‌’ తెలుగు రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. త్రివిక్రమ్‌ స్కీన్‌ప్లే, సంభాషణలు అందిస్తుండటం విశేషం. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒక‌టి ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఈ సినిమాలో రాయ‌ల‌సీమ యాస‌లో మాట్లాడుతాడ‌ని తెలుస్తోంది.

ప్ర‌ముఖ లిరిసిస్ట్ పెంచ‌ల్ దాస్ రాయ‌ల‌సీమ యాస కోసం ప‌వ‌న్ కళ్యాణ్ కు సాయం చేస్తున్నాడ‌ని సమాచారం. ఇప్ప‌‌టికే వకీల్ సాబ్ చిత్రంలో తెలంగాణ యాసలో అదరగొట్టిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇక రాయ‌ల‌సీమ మాండలికంలో దుమ్మురేపుతాడాని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలాఉంటే.. మలయాళంలో బిజు మేనన్‌, పృథ్వీరాజ్‌లు పోషించిన పాత్రలను ఇక్కడ తెలుగులో పవన్‌, రానా పోషిస్తున్నారు. ఇందులో కథానాయికలుగా సాయి పల్లవి, ఐశ్వర్యరాజేశ్‌లు ఎంపికైనట్లు సమాచారం.

తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సముద్రకని, బ్రహ్మజీ, మురళీశర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు.  వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు