Home సినిమాలు పవన్‌తో మరో సినిమా.. క‌న్ఫ‌ర్మ్ చేసిన దిల్‌రాజు

పవన్‌తో మరో సినిమా.. క‌న్ఫ‌ర్మ్ చేసిన దిల్‌రాజు

టాలీవుడ్‌ అగ్ర నిర్మాతల్లో ఒక‌రైన‌ప్ప‌టికీ దిల్ రాజుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా తీయ‌డానికి చాలా ఏళ్లు ఎదురుచూడాల్సి వ‌చ్చింది. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన 22 ఏళ్ల‌కు వ‌కీల్ సాబ్ సినిమాతో ఆయ‌న క‌ల నెల‌వేరింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వెంట‌నే ప‌వ‌న్ కళ్యాణ్‌తో సినిమా చేయ‌బోతున్నాడు దిల్ రాజు. ఈ మధ్య దిల్ రాజు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కాంబోలో వచ్చిన వకీల్ సాబ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామి సృష్టించింది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో పవన్‌ కల్యాణ్‌ ఓ కొత్త సినిమాలో నటించనున్నారట. ఇందుకు సంబంధించిన చర్చలు నడుస్తున్నాయని టాక్‌. ఈ చిత్రాన్ని ఓ తమిళ దర్శకుడు తెరకెక్కిస్తారని సమాచారం. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కూడా దిల్‌రాజు మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్‌తో మరో సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే, పవన్‌ ఇమేజ్‌కు తగినట్లు మంచి స్టోరీ ఉంటే తప్పక తీస్తానని అన్నారు. అయితే అలాంటి స్టోరీ ఒకటి దిల్‌రాజు దగ్గరకు వచ్చిందట. కథ బాగుండటంతో పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేయిస్తున్నారట. దీనిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుందని సమాచారం.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు