Home Uncategorized పవన్‌కల్యాణ్‌ “వకీల్ సాబ్” కి ముందుగా అనుకున్న టైటిల్ ఇదే.!

పవన్‌కల్యాణ్‌ “వకీల్ సాబ్” కి ముందుగా అనుకున్న టైటిల్ ఇదే.!

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వకీల్‌సాబ్‌’. దాదాపు కొన్నేళ్ల విరామం తర్వాత ఈ చిత్రంతో ఆయన తిరిగి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఏప్రిల్‌ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ‘వకీల్‌సాబ్‌’ ప్రమోషన్స్‌ను చిత్రబృందం విభిన్నంగా ప్లాన్‌ చేసింది. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో చిత్ర దర్శకుడు వేణుశ్రీరామ్‌, సంగీత దర్శకుడు తమన్‌, సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు.

ఈ క్రమంలో దర్శకుడు వేణుశ్రీరామ్‌ సినిమా టైటిల్ పై మాట్లాడుతూ.. తాము ముందుగా ‘వకీల్ సాబ్’ టైటిల్ అనుకోలేదని సినిమా కథకు తగ్గట్టుగా ‘మగువ’ అని అనుకున్నామని తెలిపారు. ‘ఈ కథ అనుకోగానే మొదట ‘మగువా’ అనే టైటిల్‌ అనుకున్నాం. ఆ తర్వాత పవర్‌స్టార్‌ని దృష్టిలో ఉంచుకుని ‘వకీల్‌సాబ్‌’ టైటిల్‌ ఫిక్స్‌ చేశాం. ఇందులోని ‘మగువా’ పాటకు రామజోగయ్య అందించిన లిరిక్స్‌ అత్యద్భుతంగా ఉన్నాయి. సాధారణమైన భాషలో ఈ పాట రాశారు. మొదట ఈ పాట వినగానే కన్నీళ్లు వచ్చేశాయి అని వేణు శ్రీరామ్ పేర్కొన్నారు.

అలాగే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ చేసే పాత్ర పేరు సత్యదేవ్ అని కూడా రివీల్ చేశారు. ఇక, ఈ సినిమా విషయానికి వస్తే బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘పింక్‌’కు రీమేక్‌గా రూపొందించారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలి, అనన్య, నివేదా థామస్‌ కీలకపాత్రలు పోషించారు. పవన్‌ ప్రేయసిగా శ్రుతిహాసన్‌ కనిపించనున్నారు. దిల్‌ రాజు నిర్మాత.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు