Home సినిమాలు 'పక్కా క‌మ‌ర్షియ‌ల్'...గోపిచంద్- మారుతి సినిమాకు ఆసక్తికర టైటిల్!

‘పక్కా క‌మ‌ర్షియ‌ల్’…గోపిచంద్- మారుతి సినిమాకు ఆసక్తికర టైటిల్!

మారుతి దర్శకత్వంలో మ్యాచో హీరో గోపీచంద్ ఒక సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, జీఏ2 సంస్థలు నిర్మిస్తున్నాయి. మార్చిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే, గ‌త కొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించి వైవిధ్య‌మైన ప్ర‌చారం చేస్తున్నడైరెక్టర్ మారుతి తాజాగా చిత్ర టైటిల్ అనౌన్స్ చేశారు. “పక్కా క‌మ‌ర్షియ‌ల్” అనే టైటిల్‌ని మూవీకి ఫిక్స్ చేసిన‌ట్టు పోస్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు. ఈ సినిమా కూడా క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో కామెడీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతుందా లేదంటే సీరియ‌స్‌గా సాగుతుందా అనేది తెలియాల్సి ఉంది. అలాగే, ఈ సినిమాలో న‌టించే న‌టీన‌టులపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. 

అయితే, అంతకుముందు టైటిల్ ఖరారు చేయకుండానే.. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించేశారు చిత్ర నిర్మాతలు. వరుస పెట్టి సినిమాలు థియేటర్లలోకి వస్తున్న తరుణంలో ముందు జాగ్రత్త చర్యగా ఇప్పుడే రిలీజ్ డేట్‌ను లాక్ చేశారు. కాగా, ఈ ఏడాది అక్టోబర్ 1న “పక్కా క‌మ‌ర్షియ‌ల్” సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థలు ఇటీవలే అధికారికంగా ప్రకటించాయి. అంతేకాదు, ఆసక్తికర సందేశంతో ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో థియేటర్ సీట్‌లో అక్టోబర్ 1న విడుదల అని ఇంగ్లిష్‌లో రాసి.. కచ్చీఫ్ వేస్తున్నట్టు చూపించారు.  యువీ, జీఏ2 వినూత్న ప్రయత్నానికి మంచి స్పందన కూడా లభించింది.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు