Home ప్రత్యేకం నేను క్షేమంగానే ఉన్నా.. అభిమానులు ఆందోళన చెందొద్దు: పవన్

నేను క్షేమంగానే ఉన్నా.. అభిమానులు ఆందోళన చెందొద్దు: పవన్

దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. తాజాగా ఇవాళ టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌కు కరోనా పాజిటీవ్ గా నిర్దారణ అయింది. దీంతో హైదరాబాద్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆయన చికిత్స  తీసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రత్యేక వైద్యబృందం పవన్ కళ్యాణ్ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆయనికి స్వల్ప జ్వరం, ఊపిరితిత్తుల్లోకి నిమ్ము చేరడంతో తగ్గడానికి ఆయన యాంటీవైరస్ మందులు వాడుతున్నారు.

ఇదిలాఉంటే.. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలో పూర్తి ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తానని, ఎవరూ ఆందోళన చెందవద్దని పవన్ కళ్యాణ్ తెలిపారు. కాగా, తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ నెల 3న నిర్వహించిన బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. అక్కడి నుంచి రాగానే కరోనా పరీక్ష చేయించుకున్నారు. వైద్యుల సూచన మేరకు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే స్వల్ప జర్వం, ఒంటినొప్పులు ఉండటంతో మరోసారి పరీక్ష చేయించుకోగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు