Home సినిమాలు నిర్మాత‌గా మారిన మాస్ మహారాజ ర‌వితేజ‌.. హీరో ఎవరంటే..?

నిర్మాత‌గా మారిన మాస్ మహారాజ ర‌వితేజ‌.. హీరో ఎవరంటే..?

‘క్రాక్‌’ సినిమా విజయంతో జోష్ మీదున్న మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ఖిలాడి’. రమేష్‌ వర్మ దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న సినిమాను పెన్ స్టూడియోస్‌, ఎ స్టూడియోస్ ఎల్ఎల్పీ కలిసి నిర్మిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం  అందిస్తున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో చిత్రానికి ఓకే చెప్పారు రవితేజ. శరత్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.

ఇదిలాఉంటే.. రవితేజ త్వ‌ర‌లో ప్రొడ్యూసర్ గా మార‌బోతున్నాడ‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చిన సంగతి తెలిసిందే. ఆర్‌టీ వ‌ర్క్స్ బ్యాన‌ర్ పై ర‌వితేజ త్వ‌ర‌లోనే ఓ సినిమా చేయ‌నున్నాడ‌న్న వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. మ‌ల‌యాళ హీరోతో ఈ సినిమా తెరకెక్కనుండ‌గా.. రెండు భాష‌ల్లో ఈ చిత్రం విడుదల కానుందట. ర‌వితేజ చిన్న బ‌డ్జెట్ సినిమాలు, ఓటీటీ ప్రాజెక్టులతోపాటు సిల్వ‌ర్ స్క్రీన్ మూవీస్ కూడా చేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నాడ‌ట‌. మ‌రి ర‌వితేజ నిర్మాత‌గా మారి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో అన్నది చూడాలి.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు