Home సినిమాలు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది వైష్ణవ్: సాయి తేజ్

నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది వైష్ణవ్: సాయి తేజ్

మెగా మేనల్లుడు, సాయిధరమ్‌తేజ్‌ సోదరుడు  వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘ఉప్పెన’. సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించాడు. సుకుమార్ రైటింగ్స్ సౌజన్యంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రిగా కీలక పాత్ర పోషించారు. ఈసినిమా ఫిబ్రవరి 12న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో తన సోదరుడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సాయి తేజ్ ఒక ట్వీట్ చేశారు.సాయి తేజ్ చేసిన ట్వీట్‌లో ఒక లేఖను కూడా పొందుపరిచారు. ఈ లేఖను ఎంతో ఎమోషనల్ గా రాశారు సాయి తేజ్. వైషు బాబూ అంటూ తన తమ్ముడిని ముద్దుగా పిలిచిన సాయి తేజ్.. అతడిని చూసి గర్వపడుతున్నానని పేర్కొన్నారు. తన తమ్ముడికి ఇది ప్రారంభం మాత్రమేనని.. ఇకపై ప్రయాణం అంత సులభంగా ఉండదని  సాయి తేజ్ పేర్కొన్నారు.

‘‘నీ సినిమా మొత్తానికి  విడుదలవుతోంది వైష్ణవ్ నాకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. నీకు ఈ సమయంలో నీకు చాలా భయంగా, ఆత్రుతగా ఉంటుందని నాకు తెలుసు..ఇది నీ ప్రారంభం మాత్రమే, ఇకపై నీ ప్రయాణం అంత సులభంగా ఉంటుందని నేను హామీ ఇవ్వలేను. కానీ, ప్రేక్షకుల నుంచి నువ్వు ప్రేమను పొందగలవని మాత్రం చెప్పగలను. ఈరోజు నీతోపాటు మా అందరికీ ఎంతో ప్రత్యేకం. ‘ఉప్పెన’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను..’’ అని సాయి తేజ్ తన లేఖలో పేర్కొన్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు