Home ప్రత్యేకం నితిన్ 'రంగ్‌దే' మూవీ రివ్యూ:

నితిన్ ‘రంగ్‌దే’ మూవీ రివ్యూ:

నటీనటులు : నితిన్‌, కీర్తి సురేశ్‌, నరేశ్‌, కౌశల్య, రోహిణి, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్‌ తదితరులు
నిర్మాతలు : సూర్యదేవర నాగ వంశీ;
దర్శకత్వం : వెంకీ అట్లూరి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్‌
నితిన్ హీరోగా, కీర్తి సురేశ్ కథానాయికగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో ‘రంగ్‌దే’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాపై ఫస్ట్‌లుక్‌, లిరికల్‌ సాంగ్స్‌, టీజర్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్‌ మంచి సంగీతాన్ని అందించారు. ఈ క్రమంలో రంగ్‌దే చిత్రం మార్చి 26న  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. నితిన్-కీర్తి సురేష్ ఎలా మెప్పించారు? అన్నది ఈ సమీక్షలో చూద్దాం.
కథ:
అర్జున్ (నితిన్‌), అనుప‌మ (కీర్తిసురేష్‌) చిన్న‌నాటి నుంచి కలిసి పెరిగారు. అను టాప్ ర్యాంకర్. అర్జున్ ఫెయిల్యూర్ స్టూడెంట్. ఈ క్రమంలో ఇంట్లో వాళ్ళు అనుని చూసి నేర్చుకో అంటూ అర్జున్ తండ్రి (న‌రేష్‌) తిడుతూ ఉంటాడు. దాంతో అనుపై కోపం పెంచుకుంటాడు అర్జున్‌. అలాంటి అర్జున్ ఊహించని సంఘటనతో అనుని పెళ్లి చేసుకోవాల్సి వ‌స్తుంది? వీరి వివాహానికి కారణమేంటి? పెళ్లి తర్వాత వీరు కలిసే ఉన్నారా? వీరిద్దరి జీవితంలో చోటు చేసుకున్న మార్పులేంటి? అనేదే మిగ‌తా చిత్ర క‌థ‌.
విశ్లేషణ:
ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఒక అబ్బాయి ఆ త‌ర్వాత ఎలా  ప్రేమని వెదుక్కున్నాడనేది ‘రంగ్‌దే’ చిత్ర కథ. సున్నిత‌మైన భావోద్వేగాల‌తో క‌థ‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేసిన వెంకీ అట్లూరి దర్శకుడిగా మరోసారి తన మార్క్ చూపించాడు. ఇక అర్జున్ అనే ఇంజినీరింగ్ కుర్రాడిగా నితిన్ చక్కగా ఒదిగిపోయాడు. కీర్తి అందంగా కనిపిస్తూ తనదైన హావభావాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. హీరో తండ్రిగా న‌రేష్‌, హీరోయిన్ త‌ల్లిగా రోహిణి చక్కటి నటన కనబర్చారు. అభిన‌వ్ గోమ‌టం, సుహాస్, బ్ర‌హ్మాజీ ఫస్టాఫ్ లో న‌వ్వులు పూయించారు. సెకండాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ ఆకట్టుకుంది.  పీసీ శ్రీరామ్ కెమెరా పనితీరు అద్భుతంగా ఉంది. దేవిశ్రీప్ర‌సాద్ సాంగ్స్, నేప‌థ్య సంగీతం సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు.
ప్లస్ పాయింట్స్:
నితిన్ – కీర్తి నటన
కామెడీ
సంగీతం
మైనస్‌ పాయింట్స్‌:
కథలో బలం లేకపోవడం
రేటింగ్: 3.25/5

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు