Home సినిమాలు నితిన్ కోసం రంగంలోకి దిగిన సూపర్ స్టార్‌ మహేశ్ బాబు

నితిన్ కోసం రంగంలోకి దిగిన సూపర్ స్టార్‌ మహేశ్ బాబు

యంగ్ హీరో నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘రంగ్ దే’. రొమాంటిక్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ మార్చి 26వ తేదీన విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసింది.

ఇందులో భాగంగా మార్చి 4న సాయంత్రం 4.05 గంటలకు సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు ఈ సినిమా మూడో సింగిల్‌ని విడుదల చేయబోతోన్నట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ‘నా కనులు ఎపుడు’ అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌తో మహేష్‌ గారు రంగ్‌ దే ప్రపంచంలోకి తీసుకెళతారని చెబుతూ.. దేవిశ్రీ సంగీత సారథ్యంలో.. సిద్‌ శ్రీరామ్‌ పాడుతున్న సాంగ్‌ ప్రోమోని చిత్రయూనిట్‌ వదిలింది. ఈ ప్రోమో చూస్తుంటే.. ఈ పాట సినిమాకి హైలెట్‌గా నిలిచేలా ఉందంటూ.. అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు.

కాగా, సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై నితిన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు