Home సినిమాలు నితిన్ కొత్త సినిమాపై క్రేజీ అప్‌డేట్..సర్‌ప్రైజ్ ఎప్పుడంటే..

నితిన్ కొత్త సినిమాపై క్రేజీ అప్‌డేట్..సర్‌ప్రైజ్ ఎప్పుడంటే..

యంగ్ హీరో నితిన్ మంచి దూకుడు మీదున్నాడు. నితిన్ న‌టించిన  ‘చెక్’ మూవీ ఫిబ్ర‌వ‌రి 26న విడుదల కానుండగా.. ‘రంగ్ దే చిత్రం’ మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాల‌పై అభిమానులలో భారీ అంచ‌నాలు ఉండ‌గా, వీటికి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు ఇప్పటికే మొద‌లు పెట్టారు నితిన్. ఇదిలా వుంటే నితిన్.. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. నితిన్ కెరీర్ లో 30వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల దుబాయ్‌లో ప్రారంభమైనట్లు సమాచారం 

అయితే, బాలీవుడ్ లో బంపర్ హిట్‌గా నిలిచిన ‘అంధాదున్’ సినిమాకి రీమేక్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ కు జోడిగా న‌భా న‌టేష్ హీరోయిన్ గా న‌టిస్తుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు చిత్రబృందం. జూన్ 11న సినిమా విడుద‌ల కానుంద‌ని తెలియ‌జేస్తూ విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో  నితిన్ ‌ స్టైలిష్ లుక్ లో క‌నిపిస్తున్నారు. ఈ మూవీలో త‌మ‌న్నా భాటియా ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. మ‌హ‌తి స్వర‌సాగ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి హ‌రి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు