Home సినిమాలు నితిన్‌ ‘చెక్‌’ విడుదల తేదీ ఫిక్స్

నితిన్‌ ‘చెక్‌’ విడుదల తేదీ ఫిక్స్

యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్ర‌సాద్   నిర్మిస్తున్న  చిత్ర ‘చెక్’. ఈ సినిమాని ఫిబ్రవరి 19న చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నామ‌ని  నిర్మాత వి. ఆనంద్ ప్రసాద్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ.. జైలు నేపథ్యంలో రూపొందిన  యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది.  కచ్చితంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ చెస్ గేమ్ ద్వారా తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్నది ఈ చిత్రం ప్రధాన కథాంశం. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.


కాగా, ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో నితిన్ ఖైదీగా కనిపిస్తుండటం కూడ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తున్నారు.అలాగే పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్, సంపత్ రాజ్, హర్షవర్ధన్, రోహిత్ పాథక్, సిమ్రాన్ చౌదరి కీలక పాత్రలు పోషించారు. కళ్యాణి మాలిక్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫి అందించారు. అనల్ అనిరుద్దన్ ఎడిటర్. వివేక్ అన్నామలై ఆర్ట్ డైరెక్టర్. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం చంద్రశేఖర్ యేలేటి.Attachments area

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు