Home సినిమాలు నితిన్‌తో జోడీకట్టిన ఫిదా బ్యూటీ!

నితిన్‌తో జోడీకట్టిన ఫిదా బ్యూటీ!

‘రంగ్ దే’ సినిమాతో  మంచి హిట్ ను ఖాతాలో వేసుకున్న యూత్ స్టార్ నితిన్.. ప్రస్తుతం ‘మాస్ట్రో’ అనే సినిమాలో నటిస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రేష్ఠ మూవీస్ పతాకంపై ఎన్.సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డిలు నిర్మిస్తున్నారు. ఈ  సినిమా తర్వాత కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ ‘పవర్ పేట’ అనే సినిమా చేయనున్నాడు నితిన్. అయితే తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం నితిన్ తన తర్వాతి చిత్రాన్ని ప్రముఖ రచయిత, దర్శకుడు వక్కంతం వంశీతో చేయనున్నట్టు తెలుస్తోంది.

రోమాంటిక్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సాయిపల్లవిని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. చిత్రబృందం ఇప్పటికే సాయిపల్లవిని సంప్రదించి కథ వివరించినట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం సాయి పల్లవి నటించిన ‘లవ్‌ స్టోరీ’, ‘విరాటపర్వం’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు నితిన్‌ హీరోగా నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘రంగ్‌దే’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. కీర్తి సురేశ్‌ కథానాయిక. ఇందులో నితిన్‌ సతీమణిగా కీర్తి నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.

 

 

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు