Home క్రీడలు నా క‌ల నిజ‌మైంది.. జీవితంలో ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను: పంత్

నా క‌ల నిజ‌మైంది.. జీవితంలో ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను: పంత్

ఆస్ట్రేలియాపై టీమిండియా చారిత్రక విజయం సాధించింది. గత 32 ఏళ్లగా గబ్బాలో ఓటమెరుగని ఆస్ట్రేలియాను మట్టికరిపించి టెస్టు సిరీస్‌ను 2-1తో సాధించింది. అయితే పోటాపోటీగా సాగిన ఈ సిరీస్‌ క్రికెట్ అభిమానులకు జ్ఞాపకంగా నిలిచిపోతుంది..కాగా..నాలుగో టెస్టులో టీమిండియా యువ ఆటగాడు రిష‌బ్ పంత్ మ‌రో కీల‌క ఇన్నింగ్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. అజేయ‌మైన హాఫ్ సెంచ‌రీతో ఆసీస్‌కు సొంతగడ్డపైనే చుక్క‌లు చూపించాడు. 137 బంతుల్లో  9 బౌండ‌రీలు, ఓ సిక్స‌ర్‌తో పంత్ అజేయంగా 89 పరుగులు చేశాడు…
కాగా..నాలుగో టెస్టులో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచిన పంత్‌ తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నాడు..’నా క‌ల నిజ‌మైంది. నేను ఫామ్‌లో లేని స‌మ‌యంలో జట్టు నాకు అండగా నిలిచింది. తొలి టెస్ట్ త‌ర్వాత నెట్స్‌లో చెమ‌టోడుస్తున్నాం. జట్టు యాజమాన్యం ఎప్పుడూ నాకు మద్దతుగా ఉంది. నేనో మ్యాచ్ విన్న‌ర్ అంటూ వెన్నుత‌ట్టి ప్రోత్స‌హించింది. అదే ఇవాళ నేను నిజం చేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది’ అని పంత్ పేర్కొన్నాడు..కాగా, పంత్‌ భారత జట్టు తరపున ఇప్పటివరకు 16 టెస్టులు, 16 వన్డేలు, 28 టీ20లు ఆడాడు.Attachments area

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు