Home క్రీడలు నాలుగవ టెస్ట్ లో ఇన్నింగ్స్ 25 పరుగుల తేడా తో భారత్ ఘన విజయం. ...

నాలుగవ టెస్ట్ లో ఇన్నింగ్స్ 25 పరుగుల తేడా తో భారత్ ఘన విజయం. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భారత్

భారత ఇంగ్లాండ్ ల మధ్య నరేంద్ర మోడీ స్టేడియం లో జరుగుతున్న నాలుగవ టెస్ట్ మూడవ రోజు ఇంగ్లాండ్ తన రెండవ ఇన్నింగ్స్ లో 135 పరుగులకు అల్ అవుట్ అయ్యింది.  నాలుగవ టెస్ట్ లో భారత్ ఇన్నింగ్స్ 25 పరుగుల తేడా తో ఘన విజయం సాధించింది.  సిరీస్ ని 3-1 తేడాతో గెలుచుకుని ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో న్యూ జి అలాండ్ తో పోరుకు సిద్ధమయ్యింది.

ఉదయం 7 వికెట్ల నష్టానికి 294 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ ని ఆరంభించిన భారత్ 365 పరుగులకు అల్ అవుట్ అయ్యింది.  సుందర్, అక్షర్ పటేల్ ఎనిమిదవ వికెట్ కు 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.  అక్షర్ పటేల్ బ్యాటింగ్ లో కూడా రాణించి 43 పరుగుల వద్ద రన్ ఔట్ అయ్యాడు.  ఇషాంత్, సిరాజ్ డక్ అవుట్ అవడంతో 365 పరుగులకు భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.  సుందర్ సెంచరీ కి నాలుగు పరుగుల దూరం లో, 96 పరుగులతో అజేయం గా నిలిచాడు.

పంత్, సుందర్, అక్షర్ పటేల్ ల చలవతో భారత్ కు 160 పరుగుల ఆధిక్యం లభించింది.   ఏడో, ఎనిమిదవ వికెట్లకు శతక భాగస్వామ్యాలు నెలకొల్పడం ఈ మ్యాచ్ లో హైలైట్.

ఇంగ్లాండ్ బౌలర్ ల లో ఆండర్సన్ 3 వికెట్లు , స్టోక్స్ 4 వికెట్లు మరియు లీచ్ రెండు వికెట్లు తీశారు.

అనంతరం రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ 135 పరుగుల కే కుప్ప కూలింది.   ఇంగ్లాండ్ బ్యాట్స్ మాన్ లలో డాసన్ 50 పరుగులు, కెప్టెన్ రూట్ ౩౦ పరుగులు చేశారు.

అశ్విన్, అక్షర్ పటేల్ మళ్ళి ఐదేసి వికెట్ల తో తిప్పేశారు. డెబ్యూ సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన అజంతా మెండీస్ (26) రికార్డు ను బద్దలు కొట్టిన అక్షర్ పటేల్ (28)

మూడవ టెస్ట్ రెండు రోజుల్లో ముగిసింది. నాలుగవ టెస్ట్ మూడు రోజుల్లోనే ముగియడం విశేషం.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు