Home సినిమాలు 'నారప్ప' ఉగాది లుక్‌లో అదిరిపోయిన వెంకటేష్ ..!

‘నారప్ప’ ఉగాది లుక్‌లో అదిరిపోయిన వెంకటేష్ ..!

ఉగాది సందర్భంగా తెలుగుచిత్రసీమలో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలకు సంబంధించిన పోస్టర్స్‌ను మేకర్స్ విడుదల చేస్తూ అభిమానులకు ఉగాది పండుగ శుభాకాంక్షలను తెలియజేశాయి. ఈ క్రమంలోనే వెంకటేశ్‌ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నారప్ప’. తమిళ చిత్రం ‘అసురన్‌’కి ఇది తెలుగు రీమేక్‌. కలైపులి యస్‌.థాను, సురేశ్‌ బాబు నిర్మించారు. ప్రియమణి కథానాయిక. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా పోస్టర్లు మంచి ఆదరణ పొందాయి. ఉగాది సంద‌ర్భంగా మ‌రో పోస్ట‌ర్ విడుద‌ల చేశారు చిత్రబృందం.

తాజా పోస్ట‌ర్ లో విక్టరీ వెంక‌టేష్ పంచెక‌ట్టులో క‌నిపించి అభిమానులుకు సంతోషాన్ని క‌లిగిస్తున్నారు. ఇదే పోస్టర్ లో రాజీవ్ క‌న‌కాల‌, ప్రియ‌మ‌ణి కూడా సందడి చేశారు. కాగా, సమాజంలోని అసమానతలు, చదువు ప్రాముఖ్యతను తెలిపే ఒక పీరియాడికల్‌ డ్రామాగా ఈ చిత్రం ఉండనుంది. ఇక మే 14న థియేటర్లలో ‘నారప్ప’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు