Home ప్రత్యేకం నాని ‘హిట్ 2’ హీరో ఎవ‌రో తెలుసా?

నాని ‘హిట్ 2’ హీరో ఎవ‌రో తెలుసా?

నాని నిర్మాతగా మారి రూపొందించిన రెండో చిత్రం ‘హిట్ 2’. పేరుకు తగ్గట్లే పెద్ద హిట్ అయ్యింది. గత ఏడాది కోవిడ్ కార‌ణంగా మార్చి నుంచి సినిమాలు లేవు. విడుద‌లై విజ‌యం సాధించిన అతి కొద్ది సినిమాల్లో ‘హిట్’ సినిమా కూడా ఒక‌టి. పోలీస్ శాఖ‌లోని క్రైమ్ టీమ్‌ హోమిసైడ్‌ ఇంటర్‌వెన్షన్‌ టీమ్‌ కేసులను ఎలా పరిష్కరిస్తుందనే ఓ ఆలోచనతో దర్శకుడు శైలేంద్ర కొలను రాసుకున్నకథ ఇది. విష్వక్ సేన్ హీరోగా రూపొందిన చిత్రం `హిట్‌`. రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. ఇటీవలే హీరో నాని, తాను నిర్మించ‌బోయే ‘హిట్ 2’ గురించి వివ‌రాల‌ను తెలియ‌జేశాడు.

హిట్‌ సినిమాలో తెలంగాణ టీంలో పనిచేసే విక్రమ్‌ రుద్రరాజు(కథానాయకుడి పాత్ర) ఎంతటి ఉత్కంఠకు గురి చేశాడో మ‌నంద‌రికి తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ టీంలో పనిచేసే కేడీ(కృష్ణ దేవ్‌) రంగంలోకి దిగే సమయం వచ్చేసింది. యువ కథానాయకుడు అడివి శేష్ హిట్ 2 సినిమాలో కేడీగా న‌టించ‌నున్న‌ట్టు పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. అంతకుమించి సస్పెన్స్ తో హిట్ 2 చిత్రాం ఉండ‌నుండ‌గా.. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త వినోదాన్ని అందిస్తుంద‌ని అంటున్నారు. కాగా.. వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై నాని నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్నారు. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు