సినిమాల విషయంలో నేచురల్ స్టార్ నాని జోరు పెంచారు. ప్రస్తుతం ‘టక్ జగదీష్’ చిత్రంలో నటిస్తున్న ఆయన దింతో పాటుగా ‘శ్యామ్ సింగరాయ్’ షూటింగ్ ను కూడా పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాను ప్రకటించిన దగ్గర నుంచీ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలో దీనిపై మంచి క్రేజ్ ఏర్పడింది. దీనికి కారణం సినిమా టైటిల్. ‘శ్యామ్ సింగ రాయ్’ అనే వినూత్నమైన టైటిల్ పెట్టడం.. టైటిల్ పోస్టర్ కూడా వైవిధ్యంగా ఉండటంతో అందరి దృష్టి దీనిపై పడింది. నాని ఇప్పటి వరకు చేయని అత్యంత ఆసక్తికర, వైవిధ్యమైన పాత్రను ఈ సినిమాలో చేయబోతున్నారని ఇప్పటికే చిత్ర యూనిట్ వెల్లడించింది.
అయితే, తాజాగా నాని మరో సినిమా కూడా షూటింగ్ ప్రారంభం చేయనుందట. ఇదివరకే నాని ‘అంటే సుందరానికి’ అనే సినిమాను ఓకే చేసాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా పూర్తిగా వినోదంతో నిండి ఉంటుందని టాక్. అలాగే సుందరానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందట. నాని గ్యాంగ్ లీడర్ సినిమా తర్వాత మైత్రి మూవీస్ బ్యానర్ లో రెండో సినిమాగా అంటే సుందరానికి చేయబోతున్నాడు. ఎప్పటినుండో అనుకుంటున్న ఈ సినిమా షూటింగ్ మే నెలలో ప్రారంభం అవుతుందని సమాచారం. చిత్రయూనిట్ కూడా ఈ సినిమా విషయంలో పనులు చాలా వేగవంతం చేశారట. ఈ సినిమాలో నాని సరసన నజ్రియా నాజిమ్ నటించనుంది. ఆమెకు ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం.