Home సినిమాలు నాని 'టక్ జగదీష్'..వాలంటైన్స్ డే గిఫ్ట్ ఇదే!

నాని ‘టక్ జగదీష్’..వాలంటైన్స్ డే గిఫ్ట్ ఇదే!

‘నిన్ను కోరి’ ‘మజిలీ’ వంటి సూపర్ హిట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్లు తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణ రూపొందిస్తున్న తాజా చిత్రం ‘టక్ జగదీష్’. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నాడు. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ఆకట్టుకున్నాయి. వాలంటైన్స్ డే సందర్భంగా చిత్ర యూనిట్ మరో బహుమతి అందించింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘ఇంకోసారి.. ఇంకోసారి..’ లిరికల్ వీడియోను రిలీజ్ చేసింది. తమన్ స్వరపరిచిన ఈ మ్యాజికల్ మెలోడీని ఈ   “ఇంకోసారి ఇంకోసారి” అనే పాట లిరిక‌ల్ వీడియోను విడుద‌ల చేశారు. నాని, రీతు వ‌ర్మ జంట‌పై చిత్రీక‌రించిన ఈ సాంగ్ సంగీత ప్రియుల‌ని ఎంతగానో ఆక‌ట్టుకుంటుంది.

కాగా, ‘టక్‌ జగదీశ్’ సినిమాని వేసవి కానుక‌గా ఏప్రిల్ 16న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ఇతివాల చిత్రబృందం ప్రకటించింది. ఇందులో జ‌గ‌దీష్ నాయుడు అనే పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నాడు నాని. ట‌క్ జ‌గ‌దీష్ చిత్రం మంచి ఎమోష‌న్స్‌తో కూడిన పూర్తి కుటుంబ నాటక చిత్రంగా రూపొందుతుంద‌ని సమాచారం. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. జగపతిబాబు, నాజర్, రావురమేష్, నరేష్, మురళీశర్మ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు